మా ఆదిలాబాద్ దసరా:
మరి ఎవరో అడిగిన్రు ఆదిలాబాద్ లో ఏమ్ పండగ మస్తు చేసుకుంటరు అని, ఏమని చెప్పాలి ఏ పండగని చెప్పాలి మరి ..?
అన్నీ పండగలు బాగా చేస్తమాయే మరి.
దసరా:
వారం - తొమ్మిది రోజులు అంతా, బొజ్జావార్ (శివుని) గుళ్లో జరిగిన పూజలు, కార్యక్రమాలు... నవరాత్రుల ఉత్సవాలు, వాటి ముగింపుగా...
నిన్నటి నవమి పండుగ నాడు దుర్గా దేవి నిమజ్జన ఊరేగింపు, దేవికి వీడ్కోలు ,
హారతి పల్లాలు పట్టుకొని అందరం కలిసి, అమ్మలతో ఫ్రెండ్స్ తో , ఎదురు వెళ్లి ,
దుర్గా దేవి కి పసుపు, కుంకుమ, ఆరతి , ప్రసాదము సమర్పించుకొని, తల్లికి మొక్కుకొని,
గుస్సాడీ డాన్సులు , కోలాటాలు , పూగిడీలు, పాటలు, జైనథ్ నుండి వచ్చే భజన వాళ్లు, వాళ్ళందరితో పొచమ్మ గుడి దానక శోభా యాత్ర, ఓహో ఏమని చెప్పేది నేను...
ఎక్కడెక్కడో వెళ్లి స్థిరపడ్నొల్లు గూడ దసరా అని అద్లాబాద్ వస్తరు మరి అంత దూరం నుండి.
అట్లా వచ్చినొల్లని అందరిని చూసినము అన్న సంతృప్తి తో దసరా సంబురము మొదలైతది మరి...
చిన్నప్పుడైతే ఇంటి ముందు బతుకమ్మ ఆడి లాస్ట్ రోజు జిన్నింగ్ మిల్లు దగ్గర నిమజ్జనం ఉంటుండే
ముందు రోజు చేతికి మైదాకు పెట్టుకోవాల్నా,
దసరా రోజు, పొద్దున్ననే తలస్నానం చెయ్యల్నా, ముగ్గులెయల్నా ,స్వస్తీకమ్, మందారం, శెన్దూర్(చంద్రం పూలు), జాజి పూలు కోసి, అందులొ కొన్ని అప్పటికే , దేవ్ ఘర్ లో(దేవుడిల్లు) పూజ చెస్తున్న - నాన్నకి ఇచ్చి, మిగతావి దేవుడికి వేయ్యాల్నాయ.
తొందరగా తినేసి మల్లి ఎప్పుడెప్పుడు సాయంత్రం అలుకు జల్లి ముగ్గులెద్దమా,
సాయంత్రం ఇంట్లో వచ్చేవాళ్లకి ఏం స్వీట్ తినిపియ్యాలె అని ఆలోచించాల్నా...
వాకిలి ఊడ్చల్లి, రంగులతో - ముగ్గులతో లోపల వాకిలి, గడపలు, బయట వాకిలి,
తుల్సి చెట్టు దగ్గర, అన్నీ నింపెయాల్నా,
ఎవరు ఏమేం ముగ్గులెసింరొ మన వాడలో ఒకసారి చూస్కొని రావాల్నా, అబ్బ ఈష ఎంత బాగా ముగ్గు వేసిందో అని ఎదురింటొల్లు అనాల్నా, 😄😉
'ఇన్కెంత సేపు ముగ్గేస్కుంటు కూర్చుంటవ్,దీపాల వేళ ఐంది' అని అమ్మ కేక వెయ్యల్నా...
నాన్న ఇంట్ల నుండి జమ్మికి బయలుదేరి వెళ్లే ముందు రెడీ గా ఉండాలె ముగ్గు మరి!
చిన్నపుడైతే నాన్నతో బాళ (Srinu) & పిల్లు (Madhav) కూడా వెళ్ళేవాళ్లు బండి మీద.
నేను కూడా వాళ్లతో (సుజుకి మీద ట్రిపుల్ / క్వాడ్రపుల్ సీట్), చిన్నప్పుడు దస్నాపూర్ దానక పొయ్, రావణాసురుడిని కాల్వడం చూసి, బంగారం - వెండి (ఆకులు!), కొని ఇంటికి వెళ్లేవాళ్లం.
ఇంకా ఇంట్లో ఉంటే, అరెరె అందరూ వచ్చేసే టైము ఐందని, తొందర తొందరగా రెడీ అయిపొవాల్నా..
'అమ్మా నెన్ ఏ డ్రస్సు వేస్కొవాలి" అని అమ్మని కాసేపు విసిగించాల్నా...😅
మరి జమ్మి కోసం ఎదురు చూడాల్నా.. ఎవరెవరు మన ఇంటికి జమ్మి ఇవ్వటానికీ వస్తరు - వచినృ అని ఆతృత పడాల్న...
ఇంతలో అమ్మ 'ఎ...ముందు దేవుడికి జమ్మి వేసినవ' అని గుర్తు చేయాల్నా...
అందరికీ జమ్మి ఇచ్చి కాళ్లు మొక్కాల్నా (...రెగ్యులర్ గా వచ్చే వాళ్లే ఉంటరు),
మనకంటే ఎవరు చిన్నగా ఉన్నరు అని చూసి వాళ్లతో కాళ్లు మొక్కిచుకొవాల్నా, ఎవరికి ఎక్కువ బంగారం దొరికిన్దని ఎంచుకొని సంతోష పడాల్న...
ఇంకా నాన్న బయట జమ్మి పంచుతూ ఒక సారి వెళ్లి వొచ్చి ఉంటే ఈ లోపల ఇంటికి ఎవరెవరు వొచ్చినృ అని నాన్న కు చెప్పాల్నా...
తెల్ల / ఆఫ్ వైటు ధొవతీ వేస్కొని వచ్చిన, చందూ కాక తెచ్చిన జమ్మితో "ఇది అసలు బంగారం అవ్,..." అన్న డైలాగ్ వినాల్నా... 😀 చందూ కాక తెచ్చిన ఆ 'అసలు' జమ్మి ని దేవుడింట్లొకి వెళ్లి వేయాల్నా...(ఇంట్లో కూడా చిన్న డబ్బా ల జమ్మి ఉంటూండే )
రాణి వైని, సచిన్ భాఉ, విశాల్ భాఉ (అందరూ) వాళ్లు వొచ్చి జమ్మి ఇవ్వాల్నా..
"ఎప్పుడొచ్చినవె ఈష, బాళ - వాళ్లు రాలే..? పిల్లు, ఎట్ల ఉన్నడు?"... అని అందరూ అడగాల్నా..
మనకు కావాల్సిన వాళ్లకి, ఇంకా కొంచం ఎక్కువ స్వీట్ బతిమిలాడి తినిపించాల్నా...
అర్రే అప్పుడే చీకటి కావస్తున్ది అని అప్పుడు, నాన్న తో బండి మీద -
గోపాల కృష్ణ మఠానికి, ఇంకా శర్మ కాక వాల్లింటికి, పుష్పా కాకు వాళ్ళింటికి వెళ్లి రావాల్నా...శర్మ కాక వాళ్లింట్లో కాకు పెట్టిన జున్ను & ఖారా తినాల్నా, "తు తర్ ఘారి యేణచ్ బంద్ కేలి.." అని అందరితో అంపిచుకొవాల్నా (ప్రతీ సారీ వాలిన్డ్లల్లకు పోయినా సరే, నువ్వు మా ఇంటికి రారనే అంటరు !)...
శర్మ కాకా వాళ్లింట్లో, ఎవరో ఒకర్ని కొత్తగా కలుసుకొవాల్నా,
ఇంటికొచ్చి ఎక్కడెక్కడ మేమ్ పోయి వొచ్చిందీ అమ్మతో చెప్పల్నా.
ఈ లోపల ఇంకా ఎవరెవ్రు వొచ్చినృ, అని అడ్గి తెలుసుకొవాల్నా
అరే అప్పుడే దసరా అయిపోయిందీ అని బాధగా అనిపియ్యల్నా...
మల్లి ఇంకెప్పుడెప్పుడు దసరా వస్తది అని అన్కోవాల్న...
(అందరూ అజ్జిని కలవాటానికి వచ్చి అజ్జి దగ్గర అన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాల్నా...
మర్నాడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ లో అరవింద్ కాక వచ్చి అజ్జి కి బంగారం పెట్టాల్నా (జమ్మి)) !
నేను మిస్స్ అవుతున్న దసరా నా కళ్లల్లో మెదిలిన దసరా!
AyudhaPooja# VijayaDashami# Adb# Dasara#
©IshaAwandhe (8Oct19)
🌿❤🥣🌺
The same ADB Dasara, in my voice in AIR broadcast , also available in the link https://youtu.be/U89RblKHs3Q (6Nov20)