Kavitha 1:
ఎప్పుడెప్పుడనిపిస్తున్న ఎదురు చూపులలా,
ఎక్కడని వెతికి అలసిపోయిన నను మరచి...
ఇంతా జరిగి ఒక క్షణమే యుగమైన...ఏల ,ఇంకా చేరలేదన్న గమ్యముకయి ఎదురుచూచి,
నాలో నే నేను మథించుతున్న వేళ,
జనియించిన వివిధ అక్షరాలను కూర్చి...
పేర్చిన ఓ అందమైన మాలికలా,
నా మది విహారము చేసి వొచ్చి...
ఏదో అలా ఆలోచనలపై వొచ్చిన ఉప్పెనలా,
నన్ను నేను తరచి తరచి...
English text:
Eppuḍeppuḍanipistunna eduru choopulalaa,
ekkaḍani vethiki alasipōyina nanu marachi...
Intaa jarigi oka ksanamē yugamaina...Ēla,
inkaa chēralēdanna gamyamukayi eduruchoochi,
naalō nē nēnu madhinchutunna vēḷa,
janiyinchina vividha aksaraalanu koorchi...
Pērchina ō andamaina maalikalalaa,
naa madi vihaaramu chēsi vochchi...
Ēdō alaa aalōchanalapai vochchina uppenalaa,
nannu nēnu tharachi tharachi...
ekkaḍani vethiki alasipōyina nanu marachi...
Intaa jarigi oka ksanamē yugamaina...Ēla,
inkaa chēralēdanna gamyamukayi eduruchoochi,
naalō nē nēnu madhinchutunna vēḷa,
janiyinchina vividha aksaraalanu koorchi...
Pērchina ō andamaina maalikalalaa,
naa madi vihaaramu chēsi vochchi...
Ēdō alaa aalōchanalapai vochchina uppenalaa,
nannu nēnu tharachi tharachi...
Dated #Jan2020
©Isha Awandhe
Kavitha 2:
సరిగమలు తెలియని వైనం,
కూసేను సంగీత కుసుమం...
ఛందస్సు తెలియని తనం,
వల్లెవెసేను కవితల సారం...
యెదకే తగిలిన అనుభవ శరం,
నేర్పేను జీవిత గుణపాఠం...
నీటి బుడగనే ప్రతీ కణం,
చెందేను అనువణువూ సంకలన- విస్ఫొటనం...
అన్నీ నువ్వుగా తెలుసుకున్న క్షణం,
మిగిలేను తెరపై ఆనందపు వీక్షణం...!
Dated #2019
©Isha Awandhe
Kavitha 3:
కరివేపాకు మొగ్గ పువ్వవుతున్న శిశిర సమీరాలు గుప్పు మన్న నిశీధిలో, ఎగిరిన పక్షుల చల్లటి రెక్కల గాలులలో, ఫల్గుణ శుక్ల చవితియందు ఎర్రగా మెరిసిన చంద్రవంక, మబ్బుల కరిలో చుక్కగా మారి, మెల్లగా కనుమరుగయ్యిందని బాధపడిన చిన్ని ప్రాణి.
Karivèpaaku mogga puvvavuthunna shishira sameeraalu, guppu manna nisheedhi (raatri) lo,
Egirina pakshula challati rekkala gaalulalo,
Falguna shukla chavithi yandu erragaa merisina chandra vanka,
Mabbula kari (cheekati) lo chukka gaa maari,
Mellagaa kanumarugayyindani baadha padina chinni praani.
Dated 17Mar2021
©Isha Awandhe
Kavitha 4:
వర్షంలో( తడిచే ) గోవుకి గొడుగవుతావో , ఓ మనీషి,
తెంపని పువ్వుకి తుమ్మెదవు అవుతావో ఓ మనీషి,
కొట్టని చెట్టుకి ప్రాణం అవుతావో ఓ మనీషి,
రాల్చని ఆకుకి గాలివి ఔతావో ఓ మనీషి,
దాటని రోడ్డుకి పశువవుతావో ఓ మనీషి,
చంపని పశువుకి ఊపిరివి అవుతావో ఓ మనీషి,
పేల్చని రాళ్ల గుట్టవు అవుతావో ఓ మనీషి,
పూడ్చని బావిలో నీళ్లవుతావో ఓ మనీషి ,
కాల్చని అడవుల రాజవుతావో ఓ మనీషి,
భావి తరాలకి స్పూర్థినౌతావో ఓ మనీషి,
సీతాకోక చిలుకవుతావో ఓ మనీషి,
నింగిలో కెగిసి చుక్కవుతావో ఓ మనీషి...
Dated 8Jul2021
©Isha Awandhe
Kavitha 5:
విసిగిపోయారు...
అన్ని రకాలుగా ప్రయత్నము చేసి విసిగిపోయారు,
ప్రయత్నము చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి...
ఎందుకంటే ప్రయత్నము చేసినాన్కనే కదా విసిగిపోయారు,
మనకున్న మదమే ఎదుటోల్లళో కూడా ఎందుకుందని అణచబోయారు... మరి విసిగిపోయారు, వాదించారు, సరికాక దొంగ మౌనమూ ధరించారు...,
వాద ప్రతివాదనలు చేసి... అలసి విసిగిపోయారు,
వాళ్లు కన్న నిజమే ... నిన్ను కూడా కనమని 'మనోబందీ' చేయబోయారు ,
వారి మాటనే నిజమని నమ్మబలికించారు, మాటలతో బెదిరించారు,
ఆనక నీ గురించి నీకే తెలువదని నవ్వారు,
ఎమీ చేసి ఐనా వారిదే చెల్లాలని అన్నారు...కానీ విఫలమయ్యారు,
ఇన్నీ చెప్పి కూడా, చివరికి నిన్ను ఒప్పించబోయారు, విస్తుపోయారు,
అందుకే వీళ్లూ వాళ్లూ కూడా అలసిపోయారు, మరి విసిగిపోయారు !
Dated 8Jul2021
©Isha Awandhe
Kavitha 6:
నీకు కాలు నొస్తే...తన కాలు నొచ్చి,
నీకంట్లో నలుసు పడితే...తన కన్ట్లో నలుసేసుకొని,
నీకు గాలి ఆడకుంటే... తను ఊపిరిలూది,
నీకానందమొస్తే...తను కన్నీరు కార్చి,
నీకాకలైతే...తను పస్తులున్డి,
నువ్వు పర్వాన్నం తింటే...తను పర్వాన్నము తిని,
నువ్వేడిస్తే...తను తుడిచే చేతు అయి,
నువ్వు నిద్దరోతే...నీ మెలకువ అయి!
నీ వెన్నంటి ఉండే నీ నీడై...నీ జీవితానికో ఆశై!
&
Kavitha 7:
బయట మేరిసె మెరుపులు, లోలో జరిగే అంతర్యుద్ధానికి దర్పనములో,
మరి లేక మెరిసిన బింబాలేమో.
వర్షపు నీరే జోల పాట అయ్యింది ఏమో,
తేనె చుక్క కూడా తనని చూసి ఈర్ష్య పడింది ఏమో,
ఇంతలా ఎలా నిర్మలముగా ఉన్నావని అని ఏమో.
తుమ్మెదొచ్చి వాలింది ఏమో, అది పువ్వయి ఉంటుందని పోల్చుకొని ఉంటుంది ఏమో.
కళ్లల్లో కలలు నింగిలో హరివిల్లుల్లా మెరుస్తున్నాయని ఏమో.
ఒక (ఛాయా)చిత్రకారుడు, చిత్రాన్ని బంధించాలనుకున్నాడేమో.
ప్రేరణ కలిగిందా ఓ కవికి, అది కూడా నీ మనసు నవ్వేనేమో.
రెక్కల రెప రెప , నీ నింగిగెగసే కాంక్షేనేమో.
నువ్వుల నలుపు, ఆ కంట్లోని చీకటి లోతుల అందాలెమో.
ఆ నవ్వుని చూసి, తెల్ల కొంగలు సిగ్గుపడ్డాయేమో.
అది రూపు అందమా, లేక మనసందమా చెప్పలేనేమో.
నేనింకా చూడని లోకానికి, నువ్వొక రారాణివేమో(రారాజువేమో)... !!
#MyQuotes #IshaA #HotFromThePan #SweeyaKavithalu 8Jul21
Dated 8Jul2021
©Isha Awandhe
Kavitha 8:
పువ్వు పడిన చోట లింగమే పుట్టి, పువ్వులు ఆకులు అన్నీ నీవై, శంభో శివ శంభో, భోళా శంకరా శంభో శివ శంభో...శంభో శివ శంభో...
నక్షత్రపు కన్నై, నక్షత్రమే తనువై, నక్షత్రాలలో నిను వెతికి, శంభో శివ శంభో...శంభో శివ శంభో...
ఒక్కక్క పువ్వే ఏరి, మూడు , ఐదు, ఏడు పువ్వులై, పువ్వూ ఆకూ అన్నీ నువ్వై...శంభో శివ శంభో...శంభో శివ శంభో...
పొయ్యి లో అగ్గి నీవై, తనువన్తా పొయ్యి అయ్యి, గాలీ, అగ్గి అన్నీ నీవై, శంభో శివ శంభో...శంభో శివ శంభో...
అభిషేకాలే నీ నెత్తిమీద పోసి, నీరూ రాయీ అన్నీ నీవై, నీవే అన్నీ అయ్యి, శంభో శివ శంభో...శంభో శివ శంభో...
ప్రపంచమేలే పంచ ముఖమోడా, నీ పంచన చేరే మార్గం కూడా నీవే అయ్యి, ఆకాశము, ఆనందము, అన్నీ నీవు అయ్యి, శంభో శివ శంభో...శంభో శివ శంభో...
8Sept21, #MyQuotes #IshaA #HotFromThePan #SweeyaKavithalu #Tathtvam
Kavitha 9:
కనుచూపు మేర కటిక చీకటి..., ఆ చీకటిని తొలిచిన చంద్రుడి వెలుగు.
అగ్ని పూల వెనకాల దాక్కున్న పుష్యమి చంద్రుడు..., ఆ పుష్యమి చంద్రుడిది కూడా నా పైన ఎర్రని మండే చూపు...
అగ్ని పూల రంగు, అగ్ని మంట కంటే కూడా సూటిగా తగిలే చల్లని సెగ.
ఆ చల్లని సెగకు కూడా చలించే చిన్న హృది,
ఆ హృది లో వెలిగే ఒక ఙానం, ఆ ఙానంచే చల్లబరచబడ్డ అహం, అఙానం.
చల్లని చంద్రుడి సెగ లేదు, అగ్ని పూలూ లేవు, హృది కూడా లేదు ! ఙానం మాత్రమే ఉంది. ఙానం నవ్వింది ప్రశాంతంగా.
#MyQuotes #SweeyaKavitha #HotFromThePan 18Jan22 @IshaA
Kavitha 10:
నీ చెయ్యే నాకు ఆధారం, నీ నీడే నా ధైర్యం. నీ నవ్వే చల్లని సమీరం, నీ కన్నులె నా మనసుకు అద్దం. నీ ఓరచూపే నా గుండెల్లో తీపి రంపం, నీ కాలి ధూళే నా సింధూరం. నీ గుండెల్లో నా పేరు నాదం, మరి కావాలి నేను నీ చూపుల తీరం. #MyQuotes #IshaA #HotFromThePan #SweeyaKavithalu 31Jan22
Nee Cheyye naaku adhaaram,
Nee neede naa dhairyam,
Nee navve challani sameeram,
Nee kannule naa manasuku addam,
Nee ora choope naa gundello teepi rampam,
Nee kaali dhoole naa sindhooram,
Nee gundello naa peru naadam,
Mari kaavaali nenu nee choopula teeram.
#IshaA #MyQuotes #SweeyaKavithalu