Kavita 1:
ఇప్పుడు చదువబోయే కవిత,
The 1st poem that iam going read now is about,
ఎప్పుడైనా ఏదైనా సందర్భము మనల్ని ఇబ్బందికి గురిచేసినప్పుడు,
Whenever certain situation bothering us,
దానిలో నుండి ఎలా బయటికి రావాలి,
How to come out of that (bothering situation),
ఎలా స్ఫూర్తి నింపాలి అన్న ఆలోచనతో వొచ్చిన కవిత ఇది:
This is written in the intention of how to get inspiration from such situation:
"స్వార్థ పూరిత భావాలు నిను ఎన్నడూ ఏమి చేయలేవురా,
ఎగతాళింపులు నీ పట్టుదలని సడలించలేవురా !
నీ నిబ్బరము చూసి దేవుడు కూడా అచ్చెరువొందెరా,
నీకు ఏల భయమురా ఓసోసీ ఓ మానవుడా !
లోకమున స్వార్థాన్ని స్వార్థముతోనే జయిఇంచరా,
నీలోని జగతి ప్రేమని ఊరికనే చంపమాకురా !
రగిల్చరా రగిలించరా, ఙన్యాన జ్యోతిని రగిలించరా
తుచ్ఛమైన లేని భ్రమకు నిను నూవు బలి ఇవ్వకురా....!! "
Kavita 2:
మా శివాజీ మామయ్య దివంగతులైన తరుణములో
This one is writen In loving memory of
మామయ్య మీద ఉన్న ప్రేమతో రాసిన భావ శ్రధ్ధాంజలి:
our beloved Shivaji Mama on hearing his demise:
"పువ్వయి రాలిన ఓ చెట్టు ప్రాణము...
చెట్టే నిజము కానితనము,
అది తెలిసిన జ్ఞానము...
ఎపుడు పొందును జనము !
(ప్రాణమును చెట్టుతో/ పువ్వు తో పోల్చి, ఈ చూసేది నిజము కాదు అన్న అర్థములో)
పువ్వు చేరేను గమ్యము...
అది కాన రాలేదు ఏ జననము
-న, ఆ జ్ఞానమే మనము...
ఎపుడు తెలుసుకొనెదము!
( కర్మ ప్రవాహములొ ఎన్ని జన్మలు ఎత్తినామో , అలా ప్రాణము గమ్యాన్నే చేరి ఉండవొచ్చు అనే ఉద్దేశముతో ...ఒక వైపు బాధ పడుతూనే నాకు నేను, మాకు మేము స్ఫూర్తి పొందటానికి రాసినాను)"
©Isha Awandhe
Kavita 3:
ఈ కవిత ఒక సందర్భములో తోటి వారికి స్ఫూర్తి నింపే ప్రయత్నములో,
This was in the context of inspiring fellow people,
ఒక కార్యక్రమము చేపటి మధ్యలో ఏదో అవాంతరాము వొస్తేను,
when i ran into some human error,
అంటే మనం చేసే ప్రతీ పని ఒక గుంపుగా వెళ్తున్నప్పుడు
అందరికీ మన ఉద్దేశాలు చేరవేయబడవచ్చు, చేరవేయలేక బడపోవొచ్చును.
in the process of helping people around and how sometimes, when we want to work together,
ఒక్కోసారి అది అపార్థానికి దారి తీయ వచ్చును లేదా మనమే
ఏదైనా తప్పిదాలు చెయవచ్చును,
the good gets misconveyed or misunderstood.
ఈ process లో ( క్రమంలో ) ఆ అసంకల్పిత తప్పిదానికి ప్రజలు
ఎలా స్పందిస్తారో అనే background (భావం) లో ఈ కవిత రాయటం జరిగింది,
In this , opposite person may misunderstand us and the words are poured of the wounded heart,
ఆ అసంకల్పిత తప్పిదం వల్ల , నా గాయ పడిన మనసులోంచి ఉబికిన ఈ పదాలు:
..due to the unconscious genuine error and the misunderstanding put together:
"ఎవరో జాలి చూపు చూసారు ఎందుకలా నీకు అవసరమా అని...
ఎవరో కోపగించుకున్నారు ఎందుకు అలా చేసావు అని...
ఇంకెవరో తెలియబూనారు ఏమైందో అని...
అందరి ఆత్రము ఒక్కటే ఎవరిది తప్పని...(అంటే తెలుసుకోవాలని)
ఒకరు నవ్వారు, ఇంకెవరో చూసి నవ్వారని...
మరొకరు నవ్వుతూ అన్నారు, ఇంత డబ్బిస్తే నీ పని చేసి పెడతామని (అంటే తప్పు సరిదిద్దటానికని)...
వేరొకరు మాట వింటున్నట్టుంటూనే... నిరూపించారు తన బుద్ధి ఏమిటి అని...
ఎవరో కొద్ది సత్పురుషులు, సత్స్త్రీలు మాత్రమే మారు మట్లాడలేదు ఎందుకు అలా చేయమంటున్నవు అని...
(తప్పు సరిదిద్దే క్రమంలో అందరి తోడ్పాటూ ముఖ్యమే మరి)
మనలోని మంచితనమే మంచితనానికి సాక్ష్యము
మనలోని తక్కువ తనమే తక్కువతనానికి నిదర్శనము
లోకము పోకడలు ఇప్పుడిప్పుడే ఇన్కా అర్థమగుచున్న తరుణములో నా మనసులో మెదలిన భావాలు...
నా భావానికి పేటెంటు హక్కులు నాదే మరి! "
Kavita 4:
ఈ కవిత రకరకాల మనుషుల్ని మనము కలిసినప్పుడు, వివిధ పరిస్థితుల్లో మనకు ఏర్పడిన సందర్భాలకు,
This one is written when qe meet diffeent people,
మనమెలా దానికి స్పందిస్తామో , ఎదుటి వాళ్లు దానికి ఎలా ప్రతి స్పందిస్తారో,
How we respond to people, situations and how people react inturn
మనల్ని ఎలా పరిస్థితులు ఇబ్బందికి గురిచేస్తాయీ,
దానినుండి మనకు మనము ఎలా నిలువరించుకొవాలీ అన్న
ఆలోచనతో సాగిన కవిత ఇది:
How situations could be testing one's patience and how to keep up woth our spirits and stay inspired during those scenarios:
"అవే అవే జాతి పగలు - అవే అవే హెచ్చరికళ్లు ( హెచ్చరిక +కళ్లు అనే పద ప్రయోగము) - అంటే హెచ్చరించే కళ్లు -
ఎన్ని జన్మలు ఎత్తినా - ఎన్ని జన్మలు గడిచినా ,
ఎప్పటికీ వీడని ఆ మూర్ఖత్వము -
ఎన్నడూ వీడిపోనని ఉండే ఆ కర్మము,
ఇవాల్టికైనా తెలియదా (అంటే తెలిసి రాదా) అని వొచ్చెను ఒక అవకాశము -
ఎప్పటిలాగే రగిలిన సెగలో కాలిపోయిన ఆ అవకాశము,
ఎందుకో ఈ మూర్ఖత్వపు మాటల తూటలు -
మరి ఇంకెందుకో ఆ వెనకాతల ఇక-పకలు !
ఒకరి సైగ చెప్పేను వేరొకరి క్రియ-లయలను -
ఇంతకన్నా ఉండునయా వేరే బానిస బతుకులనెడి ఒక ప్రశ్నము?
నీవెవరొ నేనెవరో ఎవ్వరి దారిలో ఇంకెవరో (అడ్డు రావటం)-
అని అనుకొనుచు (అనుమానించుచూ - ఆత్మన్యూనతతో ) కొట్టుమిట్టాడెను మానవ మదహంకారము,
ఎవ్వరికి అక్కరవొచ్చును ఈ 'నీ-నా' భావము -
ఇది (అంటే ఈ 'నీ-నా') లేక ఏమవును ఈ భూతలము,
ఒకరి మౌనము కాజాలదు వారి వివేకము ఎల్లప్పుడూ
(అంటే ఇతరుల నిందలో పాలుపంచుకునే వారు మౌనంగా ఉంటే ఆ నిందలో భాగం ఉన్నట్టే కదా!)-
ఒకరి మౌనము కూడా కాగలదు ప్రతీకార పరాకాయము!
(అంటే ప్రతీకారము కత్తులతోనే అవసరం లేదు, మౌనం కూడా ప్రతీకారం మారు రూపం కావొచ్చును!),
నీవా-నేనా అని పరి పరి మూర్ఖత్వపు ఛాయలు -
వీడబోయి చేయవోయీ ప్రయత్నము,
(అంటే నువ్వా నేనా అని మాటల తోనో చర్యల తోనో మూర్ఖంగా వాదనమో, పంతమో పెంచుకుంటే వొచ్చేదేమీలేదు)
ఒకరి స్వాతంత్ర్యము (అంటే భావ స్వాతంత్ర్యం )- వేరొకరి వశమేలను?
(అంటే ఒకరి భావ జాలము ఇంకొకళ్ల మాటల మీద, చర్యల మీద ఆధారపడి ఉండటమేంటి)
నీవెవరో వశమైతే మిగిలేది నీ కర్మ శేష ఫలము!
(అంటే ఒకొళ్ల భావాలు, ఒకొళ్ళ చర్యల మీద , నీ చర్యలు భావాలు ఆధారపడి ఉంటే అది నీ కర్మమే అవుతుంది అన్న ఉద్దేశముతో రాయ (వ్రాయ) బడింది )
కాగలదు ఒకరి త్యాగము -
(అంటే భరించిన మరియు మౌనంగా ఉన్న సాత్వికుల త్యాగము, ఇంకొకళ్ల అహంకారానికి బలి అవుతుంది)
మరొకరి అహంకార తిమిర దాహాన్తము,
(ఆ విషయము, ఎవరైతే అహంకారాన్ని చూపిస్తారో,దాన్ని ఆ తర్వాత మెల్లగా తెలుసుకుంటారు అన్న ఉద్దేశముతో రాయబడింది)"
Kavita 5:
ఈ కవిత నా పరిశీలనతో కొంత, కొంత నా అనుభవముతో,
This poem is written with a bit of my observation, a bit of my experience
..మరియు కొంత ఊహతో రాయబడినది, తత్వం లాగా అనిపిస్తున్ది:
...and a bit of imagination, may sound on the lines of philosophy:
"నేను అక్కడే ఉన్నాను -
ముందుకు వెళుతున్నాను, వెనక్కి వస్తున్నాను.
కింద పడి లేస్తున్నాను - కానీ నేను అక్కడే ఉన్నాను!
ఆనందములో తూగుతున్నాను - సాక్షినై మౌనంగానూ చూస్తున్నాను,
పరిగెడుతున్నాను - ఊరికనే నిల్చున్నాను.
పువ్వునీ - ఆకునీ కదిలించాననుకున్నాను,
ఎక్కడికో వెళ్లొచ్చాననుకున్నాను - గాల్లో తేలాననుకున్నాను.
కానీ అక్కడే ఉన్నాను - కల కాదనుకున్నాను,
గదిలో బందీని అయ్యాననుకున్నాను.
నిజంగా నిజమే అనుకున్నాను - నీళ్లలో మునిగి నట్టనుకున్నాను,
నీరూ - శ్వాసా వేరు కాదనుకున్నాను (కాదని తెలుసుకున్నాను).
కలలాంటి నిజమనుకున్నాను - గాలిలో రెక్కలొచ్చాయనుకొన్నాను,
రెక్కలతో నింగికెగిరి నక్షత్రాలని చూసినాననుకున్నాను.
"నక్షత్రపు అంచుల మెరుపుని కంటితో పట్టాననుకున్నాను -
నాలోనే విశ్వపటలాన్ని పరికించాననుకున్నాను!!"
ఎగిరి పోవడమూ నిజమే - కిందకి దూకడమూ నిజమే.
కానీ - అక్కడే ఉన్నాను.
నేను - అనే నేను, పాటలు పాడి - ఆటలు ఆడుతున్నాను.
ఉయ్యాలలో ఊగుతున్నాను - కాల భ్రమణంలో కాలి బూడిదైపోతున్నాను,
నాలో నేనే మధిస్తున్నాను - నేనూ నేనని ఆరాటపడుతున్నాను,
మళ్లీ పుడుతున్నాను - ఇంకా అక్కడే ఉన్నాను!
మనసు కుదుట పడింది - కళ్లకు కనువిప్పు కలిగింది (మనసువిప్పు కలిగింది?) !!
నిజం తెలిసింది - నేను ఇక్కడా అక్కడా ఉన్నాను,
అంతటా నేనే ఉన్నాను - నేనూ నువ్వూ మనమున్నాము!!! "
©Isha Awandhe
#whackedwit #hotfromthepan #myresponses #myquotes #ishaa #iamyresponses
No comments:
Post a Comment